శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 01, 2020 , 16:48:15

ర‌ష్యాలో 10 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

ర‌ష్యాలో 10 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

మాస్కో: ర‌ష్యాలో క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతూనే ఉన్నాయి. రోజూ వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 4,729 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ర‌ష్యాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ప‌ది ల‌క్ష‌లు (ఒక మిలియ‌న్‌) దాటి 10,00,048కి చేరింది. ర‌ష్యాకు చెందిన ఫెడ‌ర‌ల్ రెస్పాన్స్ సెంట‌ర్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 

మంగ‌ళ‌వారం న‌మోదైన 4,729 కొత్త‌ కేసుల‌లో మాస్కోకు చెందినవారు 641 మంది, సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌కు చెందినవారు 185 మంది, మాస్కోకు చెందినవారు 156 మంది ఉన్నారు. ఇక ఇవాళ‌ 6,318 మంది వైర‌స్ బారి నుంచి కోలుకోగా.. ర‌ష్యాలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 8,15,705కు చేరింది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా మంగ‌ళ‌వారం కొత్త‌గా 123 క‌రోనా మ‌ర‌ణాలు చోటుచేసుకోగా.. ర‌ష్యాలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 17,299కి చేరింది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo