గురువారం 09 జూలై 2020
International - Jun 30, 2020 , 12:46:07

ట్రాన్స్‌జెండర్ ఉద్యమ నేతకు అరుదైన గౌరవం

ట్రాన్స్‌జెండర్ ఉద్యమ నేతకు అరుదైన గౌరవం

వాషింగ్ టన్ డీసీ : అమెరికాకు చెందిన మార్షా పి జాన్సన్‌ అనే ట్రాన్స్‌జెండర్ లెస్బియన్, గే, బై సెక్సువల్,అండ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ  హక్కుల సాధన కోసం పోరాడారు. ఆయా కమ్యూనిటీలోని వారి అభివృద్ధి కోసం మార్షా చనిపోయేవరకు పాటుపడ్డారు. అందుకోసమే మార్షా చేసిన సేవలను గుర్తిస్తూ డూడుల్ ద్వారా గూగుల్ ఘనమైన నివాళులు అర్పించింది. ట్రాన్స్ జెండర్ల హక్కుల ఉద్యమం లో  మార్గదర్శకులలో మార్షా ఒకరు. మార్షాను మరణానంతరం  గతేడాది జూన్ 30న న్యూయార్క్ సిటీ ప్రైడ్ మార్చ్ ఆఫ్ గ్రాండ్ మార్షల్ గా సత్కరించారు. మార్షా 1945 ఆగస్టు 24 న న్యూజెర్సీలో జన్మించారు. జూన్ ను ప్రైడ్ ఆఫ్ మంత్ గా అభివర్ణించింది గూగుల్ . లెస్బియన్, గే, బై సెక్సువల్,అండ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ హక్కుల ఉద్యమంలో భాగంగా మార్షా పి జాన్సన్‌ వంద సార్లకు పైగా జైలుకు వెళ్లారు . 


logo