బుధవారం 08 జూలై 2020
International - Jun 15, 2020 , 00:32:02

అమెరికాలో 4.4 కోట్ల ఉద్యోగాలు ఫట్

 అమెరికాలో 4.4 కోట్ల ఉద్యోగాలు ఫట్

వాషింగ్టన్ డిసి: కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. దీంతో అమెరికా వంటి అగ్రరాజ్యం పై తీవ్ర ప్రభావం పడింది . దీనివల్ల కోట్లాదిమంది ఉద్యోగాలు పోయాయి. గత మూడు నెలల కాలంలో అమెరికాలో ఏకంగా 44 మిలియన్ల మంది నిరుద్యోగ ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో బిలియనీర్లు మాత్రం ఇదే కాలంలో భారీగా కూడబెట్టారు. మార్చి 18వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ మధ్య .అమెరికా బిలియనీర్ల సంపద 637 బిలియన్ డాలర్లు పెరిగింది. 12 వారాల్లో బిలియనీర్ల సంపద 2.95 ట్రిలియన్ డాలర్ల నుండి 3.58 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఈ సంపద 21.5 శాతం పెరిగింది. గత వారంలో ఈ సంపద 72 బిలియన్ డాలర్లు పెరిగింది. కానీ ఇదే కాలంలో దాదాపు నాలుగున్నర కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి, నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోగా. గత వారమే మరో 15 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు.  logo