ఆదివారం 12 జూలై 2020
International - Jun 12, 2020 , 15:14:29

బాటిల్లో పాలు తాగుతున్న పిల్ల ఏనుగు వీడియో వైరల్

బాటిల్లో పాలు తాగుతున్న పిల్ల ఏనుగు వీడియో వైరల్

నైరోబి: బాటిల్లోని పాలు తాగుతున్న పిల్ల ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 39 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో వీక్షకులను ఆశ్చర్య పరుస్తున్నది.  కెన్యాకు చెందిన జంతు సంరక్షణ సంస్థ డేవిడ్ షెల్డ్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆ వీడియోలో పిల్ల ఏనుగుకు ఓ వ్యక్తి పాల పీక ఉన్న డబ్బాతో పాలు తాగిస్తున్నాడు. రోడ్డు ప్రమాదాలకు గురైన , అనారోగ్యం పాలైన జంతువుల సంరక్షణ కోసం డేవిడ్ షెల్డ్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ కృషి చేస్తున్నది. కెన్యాలోని త్సావో నేషనల్ పార్క్ లో దీనిని ఏర్పాటు చేశారు. logo