శనివారం 04 జూలై 2020
International - Jun 03, 2020 , 01:31:19

రష్యాలో రక్తాన్ని పీల్చే టిక్స్‌ కీటకాలు

రష్యాలో రక్తాన్ని పీల్చే టిక్స్‌ కీటకాలు

మాస్కో:అగ్రరాజ్యం అమెరికా,యూరప్‌ దేశాలతో పాటు రష్యా, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇదిలా వుంటే మరోవైపు కొన్ని దేశాల్లో ప్రకృతి ప్రకోపంచూపుతున్న సంగతి తెలిసిందే. ఇక రష్యాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. ఆస్పత్రులన్నీ ఫుల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ మరో కొత్త ఉపద్రవం తలెత్తింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రక్తాన్ని పీల్చే టిక్స్‌ కీటకాలతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. వీటి బారినపడ్డ వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో వీరంతా ఆస్పత్రులల్లో అడ్మిట్ అవుతున్నారు. అయితే ఈ కీటకాలు కుట్టిన వారికి ఇవ్వాల్సిన వ్యాక్సిన్లు కావాల్సినంత లేకపోవడంతో.. అక్కడి ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయట. దీంతో అక్కడి ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. 


logo