శుక్రవారం 03 జూలై 2020
International - May 31, 2020 , 19:25:08

సింగపూర్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

సింగపూర్‌లో  పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో అరవై లక్షల మందికి పైగా సోకింది. అమెరికాలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు… మరణాలు కూడా ఇక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక అమెరికా తర్వాత.. యూరప్‌ దేశాల్లో కూడా ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్నది.  సింగపూర్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది . దీంతో ఇప్పటి వరకు సింగపూర్‌లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,884కి చేరింది. అయితే తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చిన వారి దగ్గర పనిచేస్తున్న వారికే సోకినట్లు అధికారులు పేర్కొన్నారు.  


logo