మంగళవారం 26 మే 2020
International - May 23, 2020 , 17:48:21

వారి సంస్కృతిలో భాగమైన బాడీ పెయింటింగ్స్‌

వారి సంస్కృతిలో భాగమైన బాడీ పెయింటింగ్స్‌

హైదరాబాద్ : ఆఫ్రికాలోనిహోమో సెపియన్స్‌ ఓమో లోయలో ఇప్పటికీ ప్రాచీన ఆచారాలనే పాటిస్తున్నారు.  వారి జీవన శైలిలో అత్యంత ఆసక్తి కరంగా ఉంటుంది. రంగులతో శరీరాన్ని అలంకరించుకుంటారు. దాదాపు పది లక్షల ఏండ్ల నుంచి ఈ ప్రాంతంలోనే నివసిస్తున్న కొన్ని తెగలు ప్రకృతిలో దొరికే రంగు రాళ్ళను, మట్టిని, ఇతర మినరల్‌ రాక్స్‌ను మెత్తగా పొడి చేసి శరీరాలకు పూసుకుంటూ వస్తున్నారు. ఇథియోపియా, సూడాన్‌, కెన్యా దేశాల్లో విస్తరించిన ఓమో లోయలో దాదాపు ఐదు అక్షల మంది ప్రాచీన అటవిక తెగలకు చెందిన వారున్నారు. ఈ ఆటవికులు వేసవి కాలంలో పశువులను మేపుకుంటూ నదులు, సరస్సులు ఉన్న ప్రాంతానికి వెళతారు. కానీ వర్షాలు ప్రారంభమైన వెంటనే తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటారు.  పశువులను మేపే బాధ్యతను యువకులకు, పిల్లలకు అప్పగిస్తారు.ఎరట్రి ఎండలో పశువులతో తిరిగే వీరు... ప్రమాదకరమైన సూర్య కిరణాల నుంచి శరీరాలను రక్షించుకోవటానికి తాము మెత్తగా దంచుకున్న రంగురంగుల మట్టిని శరీరంపై దట్టంగా పూసుకుంటారు. పుణ్యం, పురుషార్థం దక్కేలా శరీరానికి పూసుకునే మట్టి రంగును నిర్ణయిస్తారు. ఒక్కో రంగుకు ఒక్కో తెగలో ప్రత్యేకమైన ప్రాధాన్యత, పవిత్రత ఉంటాయి. తమ దేవత, తెగ, జంతువును సూచించే రంగులనే   వారు పూసుకుంటారు. కొన్ని రంగులు పూసుకుంటే దయ్యం, భూతం వంటి అతీత శక్తులు పారిపోతాయని వారు నమ్ముతారు. అలాగే ఈ రంగులతో శరీరాన్ని అలంకరించుకోవటంలో స్త్రీ ,పురుషులు పరస్పరం ఆకర్షించుకునే ప్రయోజనమూ ఇమిడి ఉంటుంది. ఇన్ని రకాలుగా వీరి సంస్కృతిలో బాడీ పెయింటింగ్స్‌ భాగమయ్యాయి కాబట్టే లక్షల ఏండ్లు  గడుస్తున్నా అక్కడి వారు ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. logo