మంగళవారం 26 మే 2020
International - May 23, 2020 , 16:38:26

ప్రార్థనా స్థలాలకు అనుమతి...

ప్రార్థనా స్థలాలకు అనుమతి...

ఫ్రాన్స్‌ : మత పరమైన కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఫ్రాన్స్‌ ప్రభుత్వం అనుమతించింది. ఇటువంటి సమావేశాలపై ప్రభుత్వం నిషేధించడాన్ని చట్టపరంగా సవాలు చేసిన తరువాత శనివారం నుంచి మత సేవలను తిరిగి ప్రారంభించడానికి ఫ్రాన్స్‌ అనుమతిస్తోంది. మత పెద్దలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు, అయితే ఆయా ప్రాంతాల్లో అవసరమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేయడానికి సమయం పడుతుందని చెప్పారు. 

వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి, ఫ్రెంచ్‌ ప్రార్థనా స్థలాలకు వచ్చే సందర్శకులు తప్పనిసరిగా ధరించాలి, లోపలికి ప్రవేశించిన తర్వాత చేతులు కడుక్కోవాలి, ఇతర వ్యక్తుల నుండి కనీసం ఒక మీటర్‌ (మూడు అడుగులు) దూరం పాటించాలి. గత వారం దుకాణాలు, ఇతర వ్యాపారాలు తిరిగి తెరవడం ప్రారంభించినప్పటికీ ఫ్రెంచ్‌ ప్రభుత్వం జూన్‌ 2 వరకు మత సేవలను నిషేధించింది. దేశం యొక్క అత్యున్నత పరిపాలనా సంస్థ అయిన కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్‌ ఈ నిషేధాన్ని రద్దు చేసింది, సేవలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం శనివారం ఒక ఉత్తర్వును ప్రచురించింది.


logo