బుధవారం 03 జూన్ 2020
International - May 20, 2020 , 00:38:17

కరోనా నుంచి కోలుకున్నవారిలో కొత్త సమస్య

 కరోనా నుంచి కోలుకున్నవారిలో కొత్త సమస్య

వాషింగ్టన్ డిసి: కరోనా వైరస్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై పలు సంస్థలు అధ్యయనం జరుపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వైరస్ బారినపడి కోలుకున్న కోవిడ్ రోగుల్లో ఇతర సమస్యలు వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ వైరస్  సోకిన వారు  గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. హార్ట్ ఎటాక్, గుండె పోటు, రక్తం గడ్డకట్టేందుకు కరోనా వైరస్ దోహదం చేస్తున్నదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోనికి వచ్చాయి. కరోనా వైరస్‌ నివారణకు వినియోగిస్తున్న డ్రగ్స్.. గుండె సంబంధిత రోగాల మందులతో  కలిస్తే..వారిలో రియాక్షన్స్ కు దారితీసే ప్రమాదం ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దాంతో హృద్రోగుల్లో అది ప్రాణాంతకంగా మారుతుందని వారు స్పష్టం చేశారు.  ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ కాగానే శ్వాస సంబంధిత సమస్యలపైనే వైద్యులు ఎక్కువగా దృష్టి సారించి చికిత్స అందిస్తున్నారని.. మరణానికి దారితీసే గుండె, రక్తనాళాల రుగ్మతలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచించారు.


logo