శనివారం 06 జూన్ 2020
International - May 19, 2020 , 01:23:34

ఆగస్టు నాటికల్లా కరోనా వ్యాక్సిన్?

 ఆగస్టు నాటికల్లా  కరోనా వ్యాక్సిన్?


లండన్: యావత్ మానవజాతిని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో సఫలీకృతం అవుతున్నారని చెప్పాలి. ఇప్పుడు అందరి చూపు లండన్ ఆక్సఫర్డ్ వర్సిటీపైనే ఉంది. అస్ట్రాజెనెకా అనే మందుల కంపెనీతో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రూపొందిస్తున్న "ChAdOx1 nCoV-19 "అనే కరోనా వ్యాక్సిన్ కోతులపై మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ పరిశోధనలో భాగమైన అడ్రియాన్‌ హిల్‌ అనే శాస్త్రవేత్త కరోనా వ్యాక్సిన్‌ ధర గురించి మీడియాతో పంచుకున్నారు. కరోనా వ్యాక్సిన్  అతి తక్కువధర ఉంటుందని ఆయన అన్నారు.. అతి తక్కువ ధరకు అత్యధిక మందికి అందజేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా వివిధ దేశాల్లోని సుమారు ఏడు ఇనిస్టిట్యూట్‌లలో దీన్ని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇక ఈ జాబితాలో భారత్‌లోని పూణే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. జూలై, ఆగస్టు నాటికల్లా మనుషులపై ట్రయిల్స్ చేస్తామని ఆయన తెలిపారు.


logo