శుక్రవారం 05 జూన్ 2020
International - May 16, 2020 , 23:31:50

సుజుకి స్విఫ్ట్ లాంచ్

 సుజుకి స్విఫ్ట్ లాంచ్

ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి తన 2020 సుజుకి స్విఫ్ట్ కారును అధికారికంగా జపాన్‌లో ఆవిష్కరించింది. సుజుకి సిరీస్ కార్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో స్విఫ్ట్ ఒకటి. మూడవ తరం స్విఫ్ట్ 2016 లో అంతర్జాతీయంగా ఆవిష్కరించిగా. ఇది భారతదేశంలో 2017 లో ప్రారంభించింది. మారుతి స్విఫ్ట్ చాలా కాలంగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. దీపావళి సందర్భంగా కొత్త స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారు జపాన్‌లో మిడ్ లైఫ్‌ను నవీకరించబడింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్విఫ్ట్ కారులో పెద్ద మార్పులు ఏమి లేవు. కొత్త సుజుకి స్విఫ్ట్ ప్రధాన క్రోమ్ స్ట్రిప్‌తో పాటు రేడియేటర్ గ్రిల్ కోసం కొత్త హనీక్యూబ్‌ను కలిగి ఉంది. ఈ కొత్త కారు ముందు బంపర్ కూడా కొన్ని మార్పులను కలిగి ఉంటుంది. మిగిలిన మొత్తం కారులో పెద్ద మార్పులు కనిపించవు. కొత్త సుజుకి స్విఫ్ట్ కారులో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్ అమర్చారు . కానీ కొత్త స్విఫ్ట్ భారతదేశంలో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్‌తో లభిస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగం కూడా మారదు. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త ఫ్రంట్ వీల్ సీట్,ఎగ్జిట్స్ ఉంటాయి. కొత్త స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో స్మార్ట్‌ప్లే 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది. ఈ జనాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లోని కొన్ని లక్షణాలను మార్చకుండా కొనసాగించే అవకాశం ఉంటుంది. కొత్త స్విఫ్ట్ కారులో ఇంజిన్ కొంత మార్పు చేశారు . ఇది అంతర్జాతీయ మార్కెట్లో హైబ్రిడ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. కొత్తగా పునరుద్ధరించిన డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లో ప్రవేశపెట్టిన 1.2 లీటర్ కె 12 ఎన్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ భారతదేశంలో విడుదల చేయబోయే కొత్త స్విఫ్ట్ కారులో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ బిఎస్-6 పెట్రోల్ ఇంజన్ 90 బిహెచ్‌పి పవర్ ,113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ , 5 స్పీడ్ ఏఎంటి ఆప్షన్‌ను అందించే అవకాశం ఉంది. ఈ కొత్త ఇంజిన్‌లో స్టార్ట్ , స్టాప్ సిస్టమ్ ఉంటుంది. ఈ కొత్త ఇంజిన్ మునుపటి మోడల్ ఇంజిన్ కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అలాగే ఇది అధిక మైలేజీని కూడా ఉత్పత్తి చేస్తుంది. మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ కారు పెట్రోల్ ఇంజన్ ఎంపికలో మాత్రమే విడుదల అవుతుంది. కొత్త స్విఫ్ట్ త్వరలో భారత మార్కెట్లో విడుదల కానున్నది.  


logo