బుధవారం 03 జూన్ 2020
International - May 13, 2020 , 07:23:35

212 దేశాల్లో కరోనా.. 43.35 లక్షలకు పైగా కేసులు నమోదు

212 దేశాల్లో కరోనా.. 43.35 లక్షలకు పైగా కేసులు నమోదు

హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా 212 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాపించింది. కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచ దేశాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 43.35 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 2.92 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి 15.94 లక్షల మందికి పైగా కోలుకున్నారు. 

అమెరికాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. అమెరికాలో గత 24 గంటల్లో కొత్తగా 20,685 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 1,467 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అక్కడ కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 83,425కు చేరింది. 

స్పెయిన్‌లో 26,920 మంది, రష్యాలో 2,116, యూకేలో 32,692, ఇటలీలో 30,911, ఫ్రాన్స్‌లో 26,991, బ్రెజిల్‌లో 12,404, జర్మనీలో 7,738,  టర్కీలో 3,894, ఇరాన్‌లో 6,733, ఇండియాలో 2,145, కెనడాలో 5,169, బెల్జియంలో 8,761, నెదర్లాండ్స్‌లో 5,510, స్విట్జర్లాండ్‌లో 1,867, స్వీడన్‌లో 3,313 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.


logo