గురువారం 28 మే 2020
International - May 13, 2020 , 00:38:35

82కోట్ల మంది పస్తులుంటున్నారు.... లాక్ డౌన్ ఎఫెక్ట్

82కోట్ల మంది పస్తులుంటున్నారు.... లాక్ డౌన్ ఎఫెక్ట్


కరోనా  ప్రపంచాన్నివణికిస్తుండగా..   ఈ మహమ్మారిని  కట్టడి చేయడం కోసం అమలు చేస్తున్నలాక్‌డౌన్‌ కారణంగా  కోట్లమంది పస్తులుండాల్సివస్తున్నది.  అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక భారాన్ని మోస్తూ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే లాక్‌డౌన్‌ వలన చాలా మంది ఆకలితో అలమటిస్తున్ననేపథ్యంలో 2020 గ్లోబల్ న్యూట్రిషన్‌ రిపోర్ట్ విస్తుపోయే నిజాన్న ను బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషక విలువలు లేవని ఆ నివేదికలో వెల్లడించింది. ప్రాంతం, సంపద, విద్య, విద్యాస్థాయి, వయస్సు, లింగ వివక్ష పేరిట ప్రపంచ ప్రజల్లో సామాజిక అసమానతలు కొనసాగడం వలన పోషకవిలువలుహరించుకుపోతున్నాయని తెలిపింది.  దానికి తోడు వ్యవసాయ సాగులో వచ్చిన మార్పులు కూడా ఒక కారణమని అందులో వెల్లడైంది. ప్రతి తొమ్మిది  మందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 82కోట్లు ఉందని గ్లోబల్ న్యూట్రిషన్‌ రిపోర్ట్  పేర్కొన్నది.  


 


logo