ఆదివారం 31 మే 2020
International - May 09, 2020 , 18:00:09

కోవిడ్-19 నియంత్రణ కు రోబో డాగ్స్

 కోవిడ్-19 నియంత్రణ కు రోబో డాగ్స్

సింగపూర్ :  కోవిడ్-19 ను నియంత్రించేందుకు సింగపూర్ మరోఅడుగు ముందుకేసింది. కరోనా కట్టడి కోసం రోబోడాగ్స్ నుతయారు చేసి, ప్రయోగించేందుకు సిద్ధమైంది.  ఓ పార్కులో దీనిని ప్రయోగించారు. కుక్క ఆకృతిని పోలిఉన్న ఈ రోబో కు" స్పాట్ " అని నామకరణం చేశారు. పార్కులకు వచ్చే సందర్శకుల మధ్య భౌతిక దూరం ఉంచడం లో ఇది కీలక పాత్ర పోషించనున్నది. ఇది పార్కులోని వ్యక్తుల్ని ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు సాంకేతిక నిపుణులకు పంపిస్తుంది. ఈ " స్పాట్ " రోబో ప్రయోగం విజయవంతమైతే మరికొన్నింటిని తయారుచేసేందుకు సింగపూర్ సిద్ధంగా ఉన్నది. 


logo