బుధవారం 03 జూన్ 2020
International - May 09, 2020 , 07:41:31

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40 లక్షలు దాటిపోయింది. 2,76,215 మంది కరోనాతో చనిపోయారు. 13.82 లక్షల మందికి పైగా ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 23.52 లక్షల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 13.21 లక్షలకు చేరింది. నిన్న ఒక్కరోజే అమెరికాలో 1,687 మంది కరోనాతో చనిపోయారు. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో 78,615 మంది ప్రాణాలు కోల్పోయారు. 

స్పెయిన్‌లో 26,299 మంది, ఇటలీలో 30,201, యూకేలో 31,241, రష్యాలో 1,723, ఫ్రాన్స్‌లో 26,230, జర్మనీలో 7,510, బ్రెజిల్‌లో 10,017, టర్కీలో 3,689, ఇరాన్‌లో 6,541, కెనడాలో 4,569, బెల్జియంలో 8,521, నెదర్లాండ్స్‌లో 5,359 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.


logo