శనివారం 06 జూన్ 2020
International - May 08, 2020 , 22:28:50

సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు ప‌బ్బులు మూసివేత

సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు ప‌బ్బులు మూసివేత

    

లండ‌న్:  రోజురోజుకీ తీవ్ర‌రూపం దాల్చుతున్న కోవిడ్-19 వైర‌స్ కారణంగా ప్రపంచ  దేశాల‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ బలహీన పడుతున్నది. ఈ సంక్షోభంతో బ్రిట‌న్‌లోని ప‌బ్బుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు ప‌బ్బులు మూసి ఉంచాల‌ని ప్రధాని బోరిస్ జాన్స‌న్ ప్ర‌భుత్వం ఆదేశించింది. దీంతో లాక్‌డౌన్ త‌ర్వాత సుమారు 15,000 ప‌బ్బులు శాశ్వ‌తంగా మూత‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. క‌రోనా ప్ర‌భావం ఇప్ప‌ట్లో త‌గ్గేది కాదు, దీంతో సామాజిక దూరం పాటించ‌డం అనివార్యంగా మారబోతుంది.ఇలా సంగం మంది క‌స్ట‌మ‌ర్ల‌తో ప‌బ్బులు మ‌నుగ‌డ సాధించ‌డం క‌ష్ట‌మ‌ని బ్రిటిష్ బీర్ అండ్ పబ్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎమ్మా మెక్‌క్లార్కిన్ అన్నారు. కొవిడ్‌-19 క్రిసిస్ మా రంగంపై కోలుకోని దెబ్బ‌కొట్టింద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. సెప్టెంబరు చివరి నాటికి మా వ్యాపారాలు తెరవకపోతే 40 శాతం నష్టపోవచ్చని ఆమె పేర్కొన్నారు. 


logo