శనివారం 30 మే 2020
International - May 08, 2020 , 17:17:52

బతికుండగానే తల్లిని పూడ్చిన సుపుత్రుడు

బతికుండగానే తల్లిని పూడ్చిన సుపుత్రుడు

నవమాసాలు మోసి అల్లారుముద్దుగా పెంచిన తల్లినే చంపాలనుకున్నాడు ఉత్తరచైనాలోని ఓ సుపుత్రుడు. అనారోగ్యంతో భాదపడుతున్న తల్లికి సపర్యలు చేయలేక 79 ఏండ్ల తన వృద్ద తల్లిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు 58 ఏండ్ల  కొడుకు. గత కొంత కాలంగా పాక్షిక పక్షవాతంతో భాదపడతున్న తల్లికి తన సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. దీంతో ఆమె పనులన్నీ ఆ కుమారుడే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తల్లికి సేవలు చేయడానికి ఓపిక లేని ఆ కుమారుడు ఏకంగా ఆమె బతికుండగానే పాతిపెట్టేసాడు.

మే 2వ తేదీన ఎప్పటిలాగే బయటకు చక్రాల కుర్చీపై బయటకు తీసుకువెళ్ళాడు ఆ కుమారుడు. కానీ తిరిగి తీసుకురాకపోవడంతో అనుమానం వచ్చిన అతని భార్య 3 రోజులకు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా తల్లిని సాకలేక  పూడ్చిపెట్టినట్లు తెలిపాడు. వెంటనే ఆమెను పూడ్చిపెట్టిన ప్రాంతానికి చేరుకుని చూడగా ఆమమె కొన ప్రాణంతో ఉండడం గమనించిన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి చికిత్సకు పంపారు. కుమారునిపై హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. 


logo