గురువారం 28 మే 2020
International - May 01, 2020 , 20:25:16

భార‌త్‌కు రావాల‌నుకుంటే రావ‌చ్చు

భార‌త్‌కు రావాల‌నుకుంటే రావ‌చ్చు

అమెరికాలో ఉంటున్న భార‌తీయులు స్వదేశానికి రావ‌టానికి సిద్ధంగా ఉంటే వెళ్లేందుకు త‌గిన ఏర్పాట్లు చేస్తామ‌ని అమెరికాలోని భార‌త రాయ‌బార కార్యాల‌యం ప్ర‌క‌టించింది. భార‌త్ వెళ్లాల‌నుకుంటున్న‌వారిని సంప్ర‌దిస్తున్న‌ది. క‌రోనాను క‌ట్ట‌డిచేసే క్ర‌మంలో అంత‌ర్జాతీయ ర‌వాణా స‌దుపాయాల‌న్నీ నిలిచిపోవ‌టంతో చాలామంది భార‌తీయులు అమెరికాలో చిక్కుబ‌డిపోయారు. అలాంటివారిని స్వ‌దేశం తీసుకొచ్చే అంశంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో రాయ‌బార కార్యాల‌యం ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టింది. 


logo