శుక్రవారం 05 జూన్ 2020
International - May 01, 2020 , 18:26:50

క‌రోనాపై విచార‌ణ‌కు చైనా అనుమ‌తివ్వాలిః డ‌బ్ల్యూహెచ్‌వో

క‌రోనాపై విచార‌ణ‌కు చైనా అనుమ‌తివ్వాలిః డ‌బ్ల్యూహెచ్‌వో

కోవిడ్‌-19 వైర‌స్ పుట్టుపూర్వోత్త‌రాల‌పై విచార‌ణ చేసేందుకు అంత‌ర్జాతీయ నిపుణుల‌కు చైనా అనుమ‌తి ఇస్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఈ వైర‌స్ ఏ జంతువుల నుంచి వ‌చ్చింద‌న్న‌దానిపై అంత‌ర్జాతీయ నిపుణుల‌తో క‌లిసి ఆరోగ్య సంస్థ చేప‌ట్ట‌నున్న విచార‌ణ‌లో చైనా కూడా పాలుపంచుకొని స‌హ‌క‌రించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌తినిధి తారిక్ జ‌స‌రెవిక్ కోరారు. కోవిడ్ వైర‌స్‌పై చైనాలో ప్ర‌స్తుతం చాలా అధ్య‌య‌నాలు జ‌రుగుతున్నాయ‌ని, వాటిలో ఇప్ప‌టివ‌ర‌కు డబ్ల్యూహెచ్‌వో పాలుపంచుకోలేద‌ని తెలిపారు. ఈ వైర‌స్ ఉహాన్‌లోని పచ్చిమాంసం అమ్మే మార్కెట్‌లో జంతువుల‌ నుంచి మ‌నుషులకు సోకింద‌ని చాలామంది శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మాత్రం చైనా ర‌హ‌స్య ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న ల్యాబ్ నుంచే ఈ వైర‌స్ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని వాదిస్తున్నారు. 


logo