గురువారం 28 మే 2020
International - May 01, 2020 , 17:24:59

క‌రోనా రెండేండ్లు ఉంట‌ది

క‌రోనా రెండేండ్లు ఉంట‌ది

కోవిడ్‌-19 వైర‌స్ మ‌హ‌మ్మారి క‌ష్టాలు త్వ‌ర‌లోనే తీరిపోతాయ‌ని ఎదురుచూస్తున్న‌వారికి ఇది దుర్వార్తే. ఈ వైర‌స్‌కు ఉన్న ప్ర‌త్యేక సామ‌ర్థ్యాల‌ను బ‌ట్టి చూస్తే రెండేండ్ల‌వ‌ర‌కు దీనిని నియంత్రించ‌టం క‌ష్టమేన‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన అంటువ్యాధుల ప‌రిశోధ‌న కేంద్రం తెలిపింది. ఈ వైర‌స్ మ‌నుషుల్లో ఒక‌రి నుంచి మ‌రొక‌రికి చాలా వేగంగా వ్యాపిస్తుంద‌ని, అంతేకాకుండా వ్యాధి ల‌క్ష‌ణాలు చాలాకాలం బ‌య‌ట‌ప‌డ‌క‌పోవ‌టంతో వైర‌స్ సోకిన‌వారికి ఆ విష‌య‌మే తెలియ‌ద‌ని పేర్కొంది. 

ఈ వైర‌స్‌ను నియంత్రించేందుకు ప్ర‌పంచంలో చాలాదేశాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించి పూర్తిగా నిర్భంధాలు విధించారు. అయితే ఈ లాక్‌డౌన్ల కార‌ణంగా ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌లు చిన్నాభిన్నం అవుతుండ‌టంతో క్ర‌మంగా ఎత్తేస్తున్నారు. ఒకవైపు వ్యాధి వ్యాప్తి కొన‌సాగుతుండ‌గానే వ్యాపార కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తుండ‌టంతో ఈ వైర‌స్ మ‌రింత విజృంభిస్తుంద‌ని, 2022 వ‌ర‌కు వైర‌స్ తన ప్ర‌తాపం చూపిస్తుంద‌ని ఆ సంస్థ నివేదిక‌లో అభిప్రాయ‌ప‌డింది. వ‌చ్చే రెండేండ్ల‌పాటు ద‌ఫ‌ద‌ఫాలుగా దాడిచేయ‌బోయే ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండాల‌ని సూచించింది. ఈ వైర‌స్ నిర్మూల‌న‌కు వ్యాక్సిన్ త‌యారీ ప్ర‌య‌త్నాలు ఊపందుకున్న‌ప్ప‌టికీ మ‌రో ఏడాదివ‌ర‌కు అవి అందుబాటులోకి రావ‌ని, వ‌చ్చినా త‌క్కువ మోతాదులోనే ఉంటాయ‌ని సంస్థ డైరెక్ట‌ర్ మైకేల్ ఓస్ట‌ర్‌హామ్ తెలిపారు.  


logo