గురువారం 04 జూన్ 2020
International - May 01, 2020 , 09:47:33

పాకిస్థాన్ స్పీక‌ర్‌కు క‌రోనా.. ఇటీవ‌లే ప్ర‌ధానిని క‌లిసిన స్పీక‌ర్‌

పాకిస్థాన్ స్పీక‌ర్‌కు క‌రోనా.. ఇటీవ‌లే ప్ర‌ధానిని క‌లిసిన స్పీక‌ర్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ నేష‌న‌ల్‌ అసెంబ్లీ స్పీకర్‌ అసద్‌ ఖురేషీ కరోనా వైరస్ బారినపడ్డారు. గురువారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖురేషీతోపాటు ఆయన కుటుంబసభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. అయితే, స్పీక‌ర్ ఖురేషి రెండు రోజుల క్రితం ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌తో స‌మావేశం కావ‌డం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. దీంతో ముందు జాగ్రత్తగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్పీకర్ ఖురేషి‌ ఎవరెవరిని కలిశారో గుర్తించి అంద‌రినీ క్వారెంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo