ఆదివారం 31 మే 2020
International - Apr 27, 2020 , 08:48:07

సౌదీలో మ‌రో కీలక సంస్క‌ర‌ణ‌

సౌదీలో మ‌రో కీలక సంస్క‌ర‌ణ‌

క‌ఠిన చ‌ట్టాల‌కు చిరునామాగా ఉన్న సౌదీ అరేబియాలో ఆధునిక పోక‌డ‌ల్లో భాగంగా మ‌రో కీల‌క స‌వ‌ర‌ణ చేశారు. ఆ దేశంలో మైన‌ర్ల‌పై జ‌రిగే నేరాల‌కు మ‌ర‌ణ దండ‌న అమ‌లు చేసేవారు. తాజాగా ఆ మ‌ర‌ణ దండ‌న శిక్ష‌ను రాజు స‌ల్మాన్ ర‌ద్దుచేశారు. అలాంటి నేరాల‌కు పాల్ప‌డే వారికి ఇక నుంచి న్యాయ‌స్థానాలు జైలుశిక్ష‌, జ‌రిమానా, సామాజిక సేవ వంటి శిక్ష‌లు విధించ‌నున్నారు. ఈ దేశంలో అత్యంత వివాదాస్ప‌ద‌మైన బ‌హిరంగ శిక్ష‌ల చ‌ట్టాన్ని ఇటీవ‌లే ర‌ద్దు చేశారు. ప్ర‌పంచంతోపాటు తామూ మారాల‌న్న యువ‌రాజు మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ ఆలోచ‌న‌ల మేర‌కు దేశంలోని కఠిన చ‌ట్టాల‌ను స‌డ‌లిస్తున్నారు.  


logo