ఆదివారం 31 మే 2020
International - Apr 26, 2020 , 17:46:37

యెమెన్‌లో రెబ‌ల్స్ స్వ‌యంపాల‌న‌

యెమెన్‌లో రెబ‌ల్స్ స్వ‌యంపాల‌న‌

అంత‌ర్యుద్ధంతో గంద‌ర‌గోళంగా మారిన యెమెన్‌లో ద‌క్షిణ ప్రాంతం ప్రావిన్స్‌ను తిరుగుబాటుదారులు స్వ‌యంపాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించారు. ఉత్త‌ర ప్రాంతంపై ప‌ట్టుకోసం దీర్ఘ‌కాలంగా పోరాడుతున్న హుతీ తిరుగుబాటుదారుల‌కు ప్ర‌భుత్వం అదుపుచేయ‌లేకపోవ‌టంతో ద‌శాబ్దాలుగా స్వయం నిర్ణ‌యాధికారం కోసం పోరాడుతున్న ద‌క్షిణాది తిరుగుబాటుదారులైన స‌ద‌ర‌న్ ట్రాన్సిష‌న‌ల్ కౌన్సిల్ (ఎస్‌టీసీ) కి మంచి అవ‌కాశం చిక్కింది. దాంతో ఆదివారం ఆ ప్రాంతాన్ని వారు  స్వ‌యంపాలిత‌మ‌ని ప్ర‌క‌టించారు. దీనిపై యెమెన్ ప్ర‌భుత్వం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. దేశానికి ఎస్‌టీసీ వేర్పాటువాదులే అస‌లైన విప‌త్తు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 


logo