శనివారం 30 మే 2020
International - Apr 26, 2020 , 13:30:29

నెత‌న్యాహూపై జ‌నాగ్ర‌హం

నెత‌న్యాహూపై జ‌నాగ్ర‌హం

అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజెమిన్ నెత‌న్యాహూకు వ్య‌తిరేకంగా దేశ రాజ‌ధాని టెల్ అవీవ్‌లో ఆందోళ‌న‌లు తీవ్రం అవుతున్నాయి. క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కోవాల్సిన ఆయ‌న ఇంకా ప‌ద‌విలోనే ఉండ‌టంపై వేల‌మంది ప్ర‌జ‌లు రాబిన్ స్క్వేర్ వ‌ద్ద నిర‌స‌న తెలిపారు. అధికారాన్ని కాపాడుకొనేందుకు నెత‌న్యాహూ ఇటీవ‌లే బ్లూ అండ్ వైట్ పార్టీ నేత బెన్నీగాట్జ్‌తో  ఒప్పందం చేసుకున్నారు. వారంపాటు సాగిన చ‌ర్చ‌ల అనంత‌రం కుదిరిన ఈ ఒప్పందం ప్ర‌కారం రెండు పార్టీలు అధికారాన్ని పంచుకోనున్నాయి. ఈ ఒప్పందం ప్రజాస్వామ్య విరుద్ధ‌మ‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 

త‌న‌పై  వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై నెత‌న్యాహూ మ‌రో నెల‌లో విచార‌ణ ఎదుర్కోబోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అధికారంలో ఉంటే న్యాయ‌స్థానాన్ని, న్యాయ‌మూర్తుల‌ను ప్ర‌భావితం చేస్తార‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు. 


logo