శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 26, 2020 , 12:26:42

స్పెయిన్‌లో లాక్‌డౌన్ స‌డ‌లింపు

స్పెయిన్‌లో లాక్‌డౌన్ స‌డ‌లింపు

యూర‌ప్‌దేశం స్పెయిన్‌లో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు శ‌నివారం నుంచి కొంత‌వ‌ర‌కు స‌డ‌లించారు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి వ్యాయామాలు చేసుకోవ‌చ్చ‌ని, పిల్ల‌లు కూడా బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తిస్తున్నామ‌ని స్పెయిన్ ప్ర‌ధాని పెడ్రో సాంచెజ్ ప్ర‌క‌టించారు. ప‌రిమిత దూరంపాటు కుటుంబ‌స‌భ్యులు బ‌య‌ట న‌డిచి వెళ్లేందుకు అనుమ‌తి ఇస్తామ‌ని చెప్పారు.  2వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను స‌డ‌లిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే క‌రోనా కేసులు ఇప్ప‌టిలాగే త‌గ్గుముఖం ప‌డితేనే అది సాధ్య‌మ‌ని, లేదంటే త‌మ నిర్ణ‌యాన్ని పునఃస‌మీక్షిస్తామ‌ని అన్నారు.  దేశంలో స్తానిక ప‌రిస్థితుల‌నుబ‌ట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి లాక్‌డౌన్ స‌డ‌లింపు ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఒకేసారి దేశంమొత్తం లాక్‌డౌన్ ఎత్తేయ‌టం సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు. 


logo