శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 26, 2020 , 11:33:41

మా జీవితాలు మాకివ్వండి

మా జీవితాలు మాకివ్వండి

జ‌ర్మ‌నీలో లాక్‌డౌన్‌కు వ్య‌తిరేకంగా జ‌ర్మనీలో ప్ర‌జ‌లు నిర‌స‌న‌కు దిగుతున్నారు. మార్చి 17 నుంచి దేశంలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌టంతో రోజుల త‌ర‌బ‌డి ఇండ్ల‌లోనే ఉన్న ప్ర‌జ‌లు తీవ్ర అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. నిత్యావ‌స‌రాల‌కు కూడా కొర‌త ఏర్ప‌డ‌టం కూడా ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగ‌టానికి కార‌ణ‌మ‌వుతున్న‌ది. మాస్కులు ధ‌రించి సామాజిక దూరం పాటిస్తూ రోడ్ల‌పై కూర్చొని వంద‌ల‌మంది నిర‌స‌న తెలుపుతున్నారు. కొంద‌రు పోలీసుల‌తో ఘ‌ర్ష‌ణ ప‌డుతున్నారు. నిర‌స‌న తెలుప‌టం రాజ్యాంగ హ‌క్కు అంటూ నినాదాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన దాదాపు 100 మందిని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.  


logo