సోమవారం 01 జూన్ 2020
International - Apr 23, 2020 , 18:48:15

తిండిగింజలు పోగేసుకుంటున్న చైనా

తిండిగింజలు పోగేసుకుంటున్న చైనా

కరోనా కారణంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితుల నుంచి ముందుగా చైనా పాఠం నేర్చుకున్నటే కనిపిస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ఈ దేశం భవిష్యత్తులో అసాధారణ పరిస్థితులు ఏర్పడితే తిండిగింజలకు కొరత రాకుండా చూసుకుంటున్నది. అందులో భాగంగా ఆహారధాన్యాల వ్యూహాత్మక నిల్వలను భారీగా పెంచాలని నిర్ణయించింది.

అమెరికా నుంచి 30 మిలియన్‌ టన్నులకుపైగా ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవాలని చైనా నిర్ణయించిందని ఆ దేశ విదేశాంగ వర్గాలు తెలిపాయి. పది మిలియన్‌ టన్నులు సోయాబీన్స్‌, 20 మిలియన్‌ టన్నుల మొక్కజొన్న, మరో పది మిలియన్‌ టన్నుల పత్తిని దిగుమతి చేసుకొని నిల్వ చేయాలని నిర్ణయించింది. అమెరికా చైనా మధ్య ఇటీవలే కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి చైనా తప్పనిసరిగా వ్యవసాయోత్పత్తులను కొనాల్సి ఉంది. ఆ ఒప్పందాన్ని ఈరకంగా భర్తీచేయాలని డ్రాగన్‌ దేశం నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో భారీగా ఉన్న తన జనాభాకు ఆహారభద్రత కల్పించినట్లు కూడా అవుతుంది. 


logo