శనివారం 30 మే 2020
International - Apr 23, 2020 , 17:59:25

డబ్ల్యూహెచ్వోకు చైనా మరో 30 మిలియన్ డాలర్ల విరాళం

డబ్ల్యూహెచ్వోకు చైనా మరో 30 మిలియన్ డాలర్ల విరాళం

ప్రపంచ ఆరోగ్యసంస్థ డబ్ల్యూహెచ్‌వోకు మరో 30మిలియన్‌ డాలర్ల విరాళం ఇస్తున్నట్లు చైనా గురువారం ప్రకటించింది. ఈ సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తూ అమెరికా తన విరాళం నిధులను నిలిపేసిన నేపథ్యంలో చైనా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో చైనా ఇటీవలే డబ్ల్యూహెచ్‌వోకు 20మిలియన్‌ డాలర్ల విరాళం ఇచ్చింది. తాజాగా మరో 30మిలియన్‌ డాలర్లు అందించాలని నిర్ణయించిందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జెంగ్‌షాంగ్‌ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా డబ్ల్యూహెచ్‌వో పట్ల చైనా ప్రభుత్వం, ప్రజలు తమ నమ్మకాన్ని మరోసారి చాటిచెప్పారని అన్నారు.

 


logo