ఆదివారం 31 మే 2020
International - Apr 23, 2020 , 10:27:14

రంజాన్ వేళ సౌదీ రాజు కీలక నిర్ణ‌యం

రంజాన్ వేళ సౌదీ రాజు కీలక నిర్ణ‌యం

 రంజాన్ మాసం నేప‌థ్యంలో దుబాయి రాజు, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు. అక్క‌డ జైళ్ల‌లో శిక్ష‌లు అనుభ‌విస్తున్న ఖైదీల‌ను విడిచిపెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు 874 మంది ఖైదీలను విడిచిపెట్టాలని  ఆదేశాలను జారీ చేశారు. కాగా, ఇటీవల యూఏఈలోని వివిధ జైళ్లలో ఉన్న 1,511 ఖైదీల విడుదల చేయ‌గా..  ఇప్పుడు మరోమారు ఖైదీలను విడిచిపెట్ట‌నున్నారు. ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రసాదించడం ద్వారా ఖైదీల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, అజ్మన్ రాజు కూడా 124 మంది ఖైదీలను విడిచిపెట్టనున్నట్టు వెల్లడించారు. యూఏఈ ప్రభుత్వం ప్రతి ఏడాది ఖైదీలను విడిచిపెడుతూ రావడం ఆనవాయితీగా వస్తోంది. అటు ప్ర‌భుత్వ ఆదేశాల‌తో ఆనందాన్ని నింపినట్టు అయిందని అటార్నీ జనరల్ ఆఫ్ దుబాయి ఇస్సా అల్ హుమైదన్ అన్నారు.


logo