శనివారం 06 జూన్ 2020
International - Apr 22, 2020 , 18:09:11

చైనాలో తల్లడిల్లుతున్న కరోనా రోగులు

చైనాలో తల్లడిల్లుతున్న కరోనా రోగులు

చైనాలో కరోనా రోగులు మానసికంగా కుంగిపోతున్నారు. ఉహాన్‌ నగరంలో గతేడాది డిసెంబర్‌లో పుట్టిన కోవిడ్‌-19 వైరస్‌ ఇప్పుడు చైనాలో తగ్గుముఖంపట్టి ఇతర ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. అయితే తాజాగా తెలిసిన ఓ విషయం ఆ దేశ వైద్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.

ఉహాన్‌ నగరంలో రెండు నెలల క్రితం కరోనాతో హాస్పత్రిపాలై కోలుకున్నవారికి మళ్లీ వైరస్‌ బయటపడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. ఉహాన్‌ నగరంలో కరోనా వైద్యం తీసుకొని కోలుకున్నవారిని అక్కడి పారిశ్రామికవాడలో ప్రత్యేక క్వార్టర్లలో ఉంచారు. వారికి రెండు నెలల తర్వాత కరోనా పరీక్షలు చేయగా కొందరిలో మళ్లీ వైరస్‌ ఉన్నట్లు తేలింది. దాంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. వీరికి ధైర్యం చెప్పేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మానసిక వైద్యులను కూడా నియమించింది. 


logo