సోమవారం 01 జూన్ 2020
International - Apr 22, 2020 , 17:50:56

69 మంది ఆరోగ్య కార్యకర్తలు మృతి

69 మంది ఆరోగ్య కార్యకర్తలు మృతి

బ్రిటన్‌లో కరోనా మహమ్మారి ఎంతటి విలయం సృష్టిస్తున్నది అనేదానికి ఈ వార్త ప్రత్యక్ష తార్కాణం. దేశంలో కరోనా విజృంభించటంతో రోజూ వందలమంది మరణిస్తున్నారు. వేల మందికి కొత్తగా వైరస్‌ సోకుతున్నది. వీరికి వైద్యసేవలు అందిస్తూ విధి నిర్వహణలో 69 మంది వైద్య సిబ్బంది మరణించినట్లు బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌ బుధవారం ప్రకటించింది. వీరంతా నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌కు సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం వైద్య సిబ్బందికి సరైన స్థాయిలో రక్షణ పరికరాలు అందించటంలేదని విమర్శలు వినిపిస్తున్నవేళ ఈ వార్త మరింత వేడి పెంచింది. అయితే బ్రిటన్‌ ప్రభుత్వం మాత్రం తాము ఇప్పటికే వందకోట్ల పరికరాలు సరఫరా చేసినట్లు చెపుతున్నది. 


logo