శనివారం 30 మే 2020
International - Apr 21, 2020 , 13:54:50

మానసిక ఆరోగ్యం జాగ్రతః ప్రిన్స్ విలియం

మానసిక ఆరోగ్యం జాగ్రతః ప్రిన్స్ విలియం

కరోనా మహమ్మారిని అడ్డుకొనే క్రమంలో కుటుంబాలకు దూరమై రాత్రిపగలు కష్టపడుతున్న వైద్యసిబ్బంది తీవ్ర ఒత్తిడిలో ఉంటారని వారు తమ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బ్రిటన్‌ యువరాజు విలియం సూచించారు. సామాజిక దూరం పాటించే క్రమంలో చాలారోజులుగా ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావటంతో వారుకూడా మానసికంగా ఒత్తిడికి గురయ్యే ప్రమాదముందని తన సతీమణి కేట్‌తో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విలియం అన్నారు. ఆరోగ్య కార్యకర్తలు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని, వారంతా మనకోసం ప్రాణాలను జీవితాలను త్యాగం చేసేందుకు సిద్ధపడుతున్నారని కొనియాడారు.  


logo