ఆదివారం 31 మే 2020
International - Apr 21, 2020 , 00:37:24

అక్కడ నిన్న ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదు కాలేదు

అక్కడ నిన్న ఒక్క కోవిడ్-19  కేసు కూడా నమోదు కాలేదు


 సోమవారం హాంకాంగ్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని హంకాంగ్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇప్పటి వకరకు హాంకాంగ్‌లో మొత్తం 1,026 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. అందులో 630 మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. వారంతా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారినపడి నలుగురు మరణించారు. ప్రస్తుతం 392 మంది కరోనాతో పోరాడుతున్నారు. వీరంతా డిశ్చార్జ్ అయితే.. హాంకాంగ్‌ కూడా కరోనా ఫ్రీ కంట్రీగా మారబోతుంది. దేశంలో మార్చి తొలి వారంలో మొదటి కరోనా కేసు నమోదు అవ్వగా.. అప్పటి నుంచి రోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే సోమవారం మాత్రం అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దేశంలో సోషల్ డిస్టెన్స్‌ను పాటించడంలో కఠినంగా వ్యవహరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించడం ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపింది.


logo