సోమవారం 01 జూన్ 2020
International - Apr 20, 2020 , 15:32:52

ఆ శానిటైజర్లు భేష్

ఆ శానిటైజర్లు భేష్

కోవిడ్‌ -19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన శానిటైజర్లు సమర్థంగా పనిచేస్తున్నాయని జర్మనీకి చెందిన రుహుర్‌ యూనివర్సిటేట్‌ బోకుమ్‌ (ఆర్‌యూబీ) తెలిపింది. కోవిడ్‌-19 వైరస్‌ సోకకుండా ఉండాలంటే చేతులను 30సెకండ్లపాటు కడుక్కోవాలని కొన్ని శానిటైజర్లను డబ్ల్యూహెచ్‌వో రికమెండ్‌ చేసింది. వాటి పనితీరుపై పరిశోధన చేసిన ఆర్‌యూబీ పరిశోధకులు అవి ఆరోగ్య సంస్థ సూచించినట్లుగా సదరు శానిటైజర్లతో 30 సెకండ్లపాటు చేతులు కడుక్కుంటే అవి సమర్థంగా వైరస్‌ను నిర్మూలించాయని తెలిపారు. ఆరోగ్య సంస్థ సూచించిన ఇథనాల్‌, ఐసోప్రోపనాల్‌ అనే ఆల్కహాల్‌లు వైరస్‌ను నిర్మూలించినట్లు పేర్కొన్నారు. కరోనాను నిర్మూలించే శానిటైజర్‌ తయారీలో ఏవి ఎంతపాళ్లు ఉండాలనే అంశంపై ఆరోగ్యసంస్థ కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. 80 వాల్యూమ్‌ పర్సెంట్‌ ఇథనాల్‌, 1.45 శాతం గ్లైసెరైన్‌, 0.125శాతం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఉండేలా శానిటైజర్లు తయారు చేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.  


logo