బుధవారం 03 జూన్ 2020
International - Apr 20, 2020 , 15:31:58

నార్వేలో తెరుచుకుంటున్న బడులు

నార్వేలో తెరుచుకుంటున్న బడులు

కరోనా వైరస్‌ భయంతో దాదాపు నెలపాటు మూసివేసిన బడులను నార్వే ప్రభుత్వం క్రమంగా తెరుస్తున్నది. సోమవారం నుంచి ప్రీస్కూళ్లను తెరుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చిన్నారులకు కోవిడ్‌-19వైరస్‌తో పెద్దగా ప్రమాదం లేదని తేలినందున ముందుగా ఈ పాఠశాలలను తెరువాలని నిర్ణయించినట్లు నార్వే విద్యాశాఖ మంత్రి గురి మెల్బీ తెలిపారు. అయితే తల్లిదండ్రుల నుంచి మాత్ర ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమైంది. తమ పిల్లల జీవితాలతో ప్రయోగాలు చేయబోమని స్పష్టంచేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు పేరెంట్స్‌ ప్రారంభించిన పిటిషన్‌పై ఇప్పటికే 30000 మంది సంతకాలు చేశారు. నార్వేలో మూడేండ్లలోపు పిల్లలను ప్రీస్కూలుకు పంపిస్తుంటారు. వీరిపట్ల ప్రభుత్వం కూడా చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఈ స్కూళ్లకు ప్రత్యేక నిబంధనావళి కూడా ఉంది. ప్రతి ముగ్గురు చిన్నారులకు ఒక మెంటార్‌ ఉంటారు.


logo