శనివారం 06 జూన్ 2020
International - Apr 20, 2020 , 15:29:58

వారిపై అంతులేని హింసః ఐరాస

వారిపై అంతులేని హింసః ఐరాస

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టించిన అసాధారణ పరిస్థితులు శరణార్థి మహిళలు, బాలికపట్ల అత్యంత ప్రమాదకరంగా మారాయని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. సొంత దేశంలో బతకలేని పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల్లో శరణార్థులుగా తలదాచుకుంటున్న మహిళలు, బాలికలపై లైంగకపరమైన హింస పెరుగుతున్నదని సోమవారం తెలిపింది.  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శరణార్థులు, నిరాశ్రయలు, సొంతదేశమంటూ లేని మహిళలు, బాలికలపట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం అని యూఎన్‌హెచ్‌సీఆర్‌ అసిస్టెంట్‌ హై కమిషనర్‌ గిలియన్‌ ట్రిగ్స్‌ తెలిపారు. 


logo