శనివారం 06 జూన్ 2020
International - Apr 20, 2020 , 09:00:07

వార్తలిస్తే పన్ను కట్టాల్సిందే

వార్తలిస్తే పన్ను కట్టాల్సిందే

డిజిటల్‌ దిగ్గజాలు గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. ఈ సంస్థలు ప్రచురించే, చూపించే వార్తలపై ప్రభుత్వానికి పన్ను కట్టాలని సోమవారం ఆదేశించింది. ఆస్ట్రేలియా కాంపిటీషన్‌ అండ్‌ అంజూమర్‌ కమిషన్‌ (ఏసీసీసీ) వచ్చే జూలైనాటికి డిజిటల్‌ సంస్థలు ప్రచురించే వార్తలకు చెల్లించాల్సిన పన్నులపై విధివిధానాలు రూపొందిస్తుందని ఆ దేశ ట్రెజరర్‌ జోష్‌ ఫ్రైడెన్‌బర్గ్‌ తెలిపారు. డిజిటల్‌ సంస్థల నుంచి ఈ విభాగంలో పన్నులు వసూలు చేయటంలో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ సంస్థల నుంచి వార్తలపై పన్నులు వసూలు చేయాలని ఇదివరకే నిర్ణయించిన ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాలు అందులో విఫలం అయ్యాయి. డిజిటల్‌ సంస్థల్లో ఏవి జర్నలిస్టిక్‌ వార్తలు, ఏవి కావు అనే అంశాన్ని గుర్తించటం కష్టంగా మారటంతో పన్నులు వసూలు చేయలేకపోయాయి. తాము మాత్రం ఈ అంశంలో ఓ కచ్చితమైన విధానం రూపొందిస్తున్నామని ఫ్రైడెన్‌బర్గ్‌ తెలిపారు. 


logo