శనివారం 06 జూన్ 2020
International - Apr 19, 2020 , 01:34:43

భారత్ కు వినూత్నంగా సంఘీభావం ప్రకటించిన స్విట్జర్లాండ్‌

భారత్ కు వినూత్నంగా సంఘీభావం ప్రకటించిన స్విట్జర్లాండ్‌


 
కరోనా మహమ్మారిపై భారత పోరాటానికి స్విట్జర్లాండ్‌ వినూత్నంగా సంఘీభావం ప్రకటించింది. దేశంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లో..మ్యాటర్‌హార్న్‌ శిఖరంపై మువ్వన్నెల జెండాను ప్రదర్శించింది. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో భారతీయులకు గెలిచే విశ్వాసం, సామర్థ్యం కలగాలని కోరుకుంటూ ట్వీట్ చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన విద్యుద్దీపాల కళాకారుడు.. గెరీ హాఫ్‌సెట్టర్‌.. స్విట్జర్లాండ్‌, ఇటలీ దేశాల మధ్య ఉన్న ఈ ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లో.. దాదాపు 4,478 మీటర్ల ఎత్తున్నశిఖరంపై లేజర్‌ లైట్లతో పలు దేశాల జెండాలను ప్రదర్శించారు. ప్రపంచ దేశాలన్నీ ఈ కంటికి కనిపించని కరోనా మహమ్మారితో చేస్తున్న పోరాటంలో గెలవాలని.. ఈ లైటింగ్‌ సిరీస్‌ను స్టార్ట్‌ చేశారు. చిమ్మని చీకట్లో మిణుకు మిణుకు చుక్కల్లో ఆ పెద్ద పర్వతంపై.. మిళమిళ మెరిసిన మన మువ్వన్నెల జెండా చూపరులను ఆకట్టుకుం తున్నది.


logo