గురువారం 04 జూన్ 2020
International - Apr 19, 2020 , 00:36:27

పాక్‌కు కరోనా టెన్షన్ మరింత పెరిగింది ఎందుకంటే ?

   పాక్‌కు కరోనా టెన్షన్ మరింత పెరిగింది ఎందుకంటే ?కరోనా మహమ్మారి అన్ని దేశాలను వణికిస్తు న్నది. ఇప్పటి వరకు 22లక్షల మంది కరోనా బారిన పడగా.. ఇందులో లక్షన్నరకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ మహమ్మారి పాకిస్థాన్‌ను కూడా అతలాకుతలం చే స్తున్నది. రంజాన్ మాసం దగ్గరపడుతుంటే.. తబ్లీఘీ సభ్యుల జాడ దొరక్కపోవడం తో పాక్‌కు కరోనా టెన్షన్ మరింత పెరిగింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గత మార్చి నెలలో తబ్లీఘీలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విదేశీయులు కూడా రావడం.. వారి ద్వారా కరోనా పాజిటివ్ సోకడం పాకిస్థాన్‌లో కరోనా కేసులకు ఆజ్యం పోసినట్లైంది. ఈ సమేవేశంలో వేల మంది పాక్‌లోని తబ్లీఘీ సభ్యులు పాల్గొన్నారు. అయితే వీరందరి అడ్రసులు కనుక్కునేందుకు ఎంత ప్రయత్నం చేసినా ట్రేస్ చేయలేకపో తున్నది. ఇదే ఇప్పుడు పాక్‌ను కలవరపెడుతుంది. త్వరలో రంజాన నెల ప్రారంభం కానుండటంతో.. కరోనా నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై పాక్ ప్రభుత్వ వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరట్లేదు. పూర్తిగా లాక్‌డౌన్ విధించాలని ఓ మంత్రి అంటే.. మరోకరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం తన మనసులోని మాట బయటపెట్టకుండా.. ఇంకా జాప్యం చేస్తున్నారు. మరోవైపు ఇంకో మంత్రి.. అసలు పాక్‌లో కరోనా కేసులు పెరగడానికి తబ్లీగీ సమావేశాలే కారణమంటూ బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. తబ్లీఘీలకు ఎంతమందికి కరోనా సోకిందన్న దానిపై టెన్షన్ మొదలైంది. 


logo