శనివారం 30 మే 2020
International - Apr 18, 2020 , 17:01:28

ట‌ర్కీలో వ‌య‌సుల వారిగా ఆంక్ష‌లు

ట‌ర్కీలో వ‌య‌సుల వారిగా ఆంక్ష‌లు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తున్న క్ర‌మంలో అన్ని దేశాలు లాక్డౌన్‌, ఆంక్ష‌ల‌ను పాటిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టర్కీ కూడా ప‌లు ఆంక్ష‌ల‌ను విధించింది.  కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అనూహ్య, ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటోంది. లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలపై ఆ దేశం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోంది. వయసుల వారీగా అక్క‌డ‌ ఆంక్షలు విధిస్తోంది. వారాంతం మినహా మిగతా రోజుల్లో 20 ఏళ్ల లోపువాళ్లు, 60 ఏళ్లు దాటినవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ  బయటకు రావద్దని ఆదేశాలు జారీచేసింది. 20 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లు బయటకు వెళ్లొచ్చని సూచించింది. అటు నిర్మాణ రంగం, పరిశ్రమలకు అనుమ‌తించిన ప్ర‌భుత్వం... బ్యాంకులు కొన్ని గంటలు పని చేసేందుకు వీలు కల్పించింది. రెస్టారెంట్లు తెరిచే ఉన్నప్పటికీ.. హోమ్ డెలివరీలు, పికప్ ఆర్డర్లకే అనుమతి ఇచ్చింది. అటు ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే ట‌ర్కీ...ఇప్పుడు జన సంచారమే లేక వెలవెలబోతున్నది. టర్కీలో ఇప్పటికే 78 వేల మందికి వైరస్ సోకగా.. 17 వందల పైచిలుకు మరణాలు సంభవించాయి.


logo