మంగళవారం 26 మే 2020
International - Apr 18, 2020 , 14:11:10

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో డిమాండ్

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో డిమాండ్

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను వెంటనే ఎత్తివేసి దేశ సరిహద్దులు తెరువాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో ఆదేశించారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దక్షిణ అమెరికా ఖండంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్‌ తీవ్రంగా నష్టపోతున్నదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, రాష్ట్రాలు, నగరాల్లో లాక్‌డౌన్‌ సడలింపులపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, నగరాల మేయర్లదే తుది నిర్ణయమని బ్రెజిల్‌ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దాంతో రాష్ట్రాలు, నగరాల్లో ఏమైనా చేసుకోండి కానీ దేశ సరిహద్దులు మాత్రం వాణిజ్యం కోసం తెరువాలని గట్టిగా డిమాండ్‌ చేశారు.

కరోనా వైరస్‌పై ఆయన గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది మామూలు వైరసేనని, దానివల్ల కొద్దిమంది మరణించినంత మాత్రాన కఠిన ఆంక్షలు విధించి ఆర్థిక వ్యవస్థను పాడుచేయలేమని  వ్యాఖ్యానించారు. దాంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ దేశంలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా బొల్సొనారోను వ్యతిరేకించారు. తాజాగా గత గురువారం ఆయన లాక్‌డౌన్‌పై తన ఆరోగ్యశాఖ మంత్రితో వాగ్వాదానికి దిగారు.  


logo