శనివారం 06 జూన్ 2020
International - Apr 18, 2020 , 12:35:04

లండన్ నుంచి తెలంగాణ వాసి మృతదేహం తరలింపు

లండన్ నుంచి తెలంగాణ వాసి మృతదేహం తరలింపు

హైదరాబాద్ : వర్ధన్నపేట నియోకవర్గంలోని ఐనవోలు మండలం రాంనగర్ గ్రామానికి చెందిన కాగితపు సతీష్ కుమార్ ఈ నెల 12వ తేదీన గుండెపోటుతో లండన్ లో మృతి చెందాడు. సతీష్ కుమార్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కుమారుడుడ విశాల్ ఆరూరి, నందనం గ్రామానికి చెందిన రాజు కలిసి అక్కడి అధికారులతో మాట్లాడారు. లండన్ లో ఉన్న తెలుగు, తెలంగాణ, ఎన్నారై టీఆర్ఎస్ లండన్ సంస్థ ప్రతినిధులు అనిల్ కూర్మాచలం, కిరణ్ పసునూరి, అశోక్ గౌడ్, గంప వేణు, సుమన్ బలమూరి, పింగిళి శ్రీనివాస్ రెడ్డి, కిశోర్ మునుగాల కలిసి సతీస్ మృతదేహాన్ని తెలంగాణకు తీసుకువచ్చేందుకు ఆర్థిక సాయం చేశారు. రూ. 16 లక్షలు సమకూర్చారు. 

అయితే 18వ తేదీన లండన్ నుంచి ముంబయి ఎయిర్ పోర్టుకు బయల్దేరిన కార్గో విమానంలో సతీష్ మృతదేహాన్ని తరలిస్తున్నారు. 20వ తేదీ తెల్లవారుజామున 2:10 గంటలకు ముంబయి ఎయిర్ పోర్టుకు విమానం చేరుకోనుంది. సతీష్ మృతదేహాన్ని ముంబయి నుంచి ఐనవోలు మండలం రాంనగర్ కు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ లేఖ రాశారు. సతీష్ తల్లిదండ్రులు కడుపేదరికంలో ఉన్నారని, ఆ కుటుంబానికి సహాయం చేయాలని ఆరూరి రమేశ్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు.   


logo