బుధవారం 03 జూన్ 2020
International - Apr 17, 2020 , 16:00:24

ఈ కష్టం ఎవరికీ రాకూడదు

ఈ కష్టం ఎవరికీ రాకూడదు

కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న కష్టాలకు ఈ ఘటన అద్దంపడుతున్నది. కేరళకు చెందిన ఓ కుటుంబం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నివాసం ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు జుయెల్‌ జీ జోమే షార్జాలోని జెమ్స్‌ మిలీనియమ్‌ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్నాడు. గత ఏడేండ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు ఈ నెల 11న అక్కడే మృతి చెందాడు. అయితే కేరళలోని వారి సొంత పట్టణమైన పథనంతిట్టులో తమ కుమారుడిని ఖననం చేయాలని భావించిన తల్లిదండ్రులు యూఏఈ అధికారులను సంప్రదించి అనుమతి పొందారు.

అయితే శవాన్ని తరలించేందుకు మాత్రమే అనుమతించిన అధికారులు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబ సభ్యులు ప్రయాణించేందుకు నిరాకరించారు. దాంతో జోమె మృతదేహం మాత్రమే కేరళ చేరుకోగా వారి బంధులు అంత్యక్రియలు జరిపించారు. తల్లిదండ్రితోపాటు జోమే ఇద్దరు తమ్ముళ్లు ఫేస్‌బుక్‌లైవ్‌ ద్వారా అంత్యక్రియలను నిర్వహించారు. తమ కుమారుని అంతిమ సంస్కారాలు స్వయంగా చేయలేకపోయామని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.  

 


logo