బుధవారం 03 జూన్ 2020
International - Apr 17, 2020 , 15:00:15

ఆఫ్గాన్లో కూలీల కాల్చివేత

ఆఫ్గాన్లో కూలీల కాల్చివేత

ఆఫ్గనిస్తాన్‌లో దుండగులు అమాయక కూలీలను కాల్చిచంపారు. పర్వాన్‌ ప్రావిన్స్‌లోని అమెరికాకు చెందిన బగ్రామ్‌ ఎయిర్‌ బేస్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ దురాగతానికి పాల్పడ్డారు. కూలీలు తమ పనులు ముగించుకొని ఇండ్లకు తిరిగి వస్తుండగా బైక్‌ వచ్చిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు కూలీలు ఘటనా స్థలంలోనే చనిపోయారని పర్వాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ ప్రతినిధి వాహిదా షకర్‌ శుక్రవారం ప్రకటించారు. కాల్పులు జరిపినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడి తాము చేయలేదని తాలిబాన్లు ప్రకటించారు.  


logo