ఆదివారం 31 మే 2020
International - Apr 16, 2020 , 16:01:47

అది కరోనా క్యారియర్

అది కరోనా క్యారియర్

ఫ్రాన్స్‌ నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక (ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌) చార్లెస్‌ దీ గాల్లీ కరోనా క్యారియర్‌గా మారిపోయింది. ఆ నౌకలో పనిచేస్తున్న సిబ్బందిలో ఏకంగా 668మందికి కోవిడ్‌-19 వైరస్‌ సోకింది. వారిలో 31 మందిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సిబ్బంది మొత్తానికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని నేవీ అధికాలు తెలిపారు. బాల్టిక్‌ సముద్రంలో ఇటీవలే ఈ నౌక ఉత్తర ఐరోపా దేశాల నేవీలతో కలిసి సంయుక్త నేవీ విన్యాసాల్లో పాల్గొన్నది. ఆ సమయంలోనే నౌకలోని 40మంది సిబ్బందికి కరోనా లక్షణాలు కనిపించటంతో నిర్ణీత సమయానికంటే రెండు వారాలు ముందే తిగిరి గమ్యస్థానం చేరింది. అప్పటికే వ్యాధి నౌకలో తీవ్రంగా పాకిపోయింది. 


logo