శనివారం 30 మే 2020
International - Apr 16, 2020 , 15:29:58

ప్యారిస్‌లో ఆఫ్గన్‌ పౌరుడి కాల్చివేత

ప్యారిస్‌లో ఆఫ్గన్‌ పౌరుడి కాల్చివేత

ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌లో ఆఫ్గాన్‌ పౌరుడిని పోలీసులు కాల్చిచంపారు. నగరంలోని ఈశాన్య సబ్‌అర్బన్‌లో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులపై కత్తితో దాడిచేయటానికి ప్రయత్నించటంతో కాల్చిచంపినట్లు పోలీసులు వెల్లడించారు. అతను తన వద్ద ఆయుధాన్ని ఎందుకు దాచుకున్నాడు, పోలీసులపై ఎందుకు దాడికి ప్రయత్నించాడన్నది తెలుసుకొనే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. కరోనాతో తల్లడిల్లుతున్న ప్యారిస్‌లో ఈ నెల 4న ఓ సూడాన్‌ జాతీయుడు కత్తితో స్వైరవిహారం చేసి ఇద్దరు వ్యక్తులున పొడిచి చంపాడు. దాంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.  


logo