శనివారం 30 మే 2020
International - Apr 16, 2020 , 14:55:48

మీ ఆరోపణలు అర్థరహితం

మీ ఆరోపణలు అర్థరహితం

భారత్‌లో కరోనా వ్యాధిగ్రస్తులకు మత ప్రాతిపదికన వైద్యం అందిస్తున్నారన్న అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్చ కమిషన్‌ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కరోనా వైరస్‌పై తాము తీవ్రమైన యుద్ధం చేస్తున్నామని, ఎవరిపట్లా వివక్ష చూపటంలేదని విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ స్పష్టంచేశారు. అహ్మదాబాద్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో కరోనా రోగులను వారి మతం ఆధారంగా విభజించి వేర్వేరుగా వైద్యం అందిస్తున్నారని మత స్వేచ్ఛ కమిషన్‌ ఆరోపించింది. దీనిపై స్పందించిన శ్రీవాత్సవ అమెరికా సంస్థ అబద్దాలను ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కరోనాపై పోరాటంలో భారత ప్రభుత్వం చేపట్టిన మెడికల్‌ ప్రొటోకాల్‌పై తప్పుడు ప్రచారం తగదని హితవు పలికారు.  


logo