బుధవారం 03 జూన్ 2020
International - Apr 16, 2020 , 08:12:11

అమెరికాలో కరోనా మరణ మృదంగం

అమెరికాలో కరోనా మరణ మృదంగం

అమెరికాలో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తున్నది. 15వ తేదీ ఒక్కరోజే దేశంలో 2600 మంది కరోనా బారినపడి మరణించారు. కోవిడ్‌-19 వైరస్‌ మనుషులకు వ్యాపించటం మొదలుపెట్టిన తర్వాత ఏ దేశంలో అయినా 24 గంటల్లో ఇంత భారీ ఎత్తున మరణాలు సంభవించటం ఇదే మొదటిసారి. 15వ తేదీ నాటికి అమెరికాలో మృతుల సంఖ్య 28,326కు చేరింది. వ్యాధి సోకినవారి సంఖ్య 6,36,350కి చేరిందని జాన్‌హాప్కిన్స్‌ యూనివర్సిటీ ప్రకటించింది. మరోవైపు కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.  


logo