శనివారం 30 మే 2020
International - Apr 15, 2020 , 18:52:31

మాకు చైనా ఏ సమాచారం ఇవ్వలేదుః అమెరికా

మాకు చైనా ఏ సమాచారం ఇవ్వలేదుః అమెరికా

కరోనా వైరస్‌ సమాచార మార్పిడిపై చైనాపై అమెరికా విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. అమెరికాలో కరోనా వల్ల రోజూ వేలమంది మరణిస్తుండటతో అధ్యక్షుడు ట్రంప్‌సహా ఆయన పాలనావర్గంలోని నేతలంతా చైనాపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో చైనాపై మండిపడ్డారు. కరోనాకు సంబంధించిన ఏ సమాచారాన్నీ అమెరికన్లకు చైనా సమయానికి అందివ్వలేదని విమర్శించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వోపై కూడా ఆయన విమర్శల వర్షం కురిపించారు.

వైరస్‌ బయటపడిన మొదట్లోనే మేం దాని గురించి సమాచారం చైనాను అడిగాం. కానీ చైనా ఇవ్వలేదు. ఉహాన్‌లో తడి మార్కెట్‌ ఉందని మాకు తెలుసు. అందులోనే కోవిడ్‌-19వైరస్‌ పుట్టిందని కూడా తెలుసు. ఈ వైరస్‌పై పరిశోధన జరిపే ల్యాబ్‌ కూడా అక్కడ ఉందని తెలుసు అని పాంపియో అన్నారు.  ఆ ల్యాబులో చైనీయులు చాలా ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తున్నారని విమర్శించారు. 


logo