శనివారం 06 జూన్ 2020
International - Apr 15, 2020 , 08:39:10

కైరోలో ఉగ్రవాదుల కాల్చివేత

కైరోలో ఉగ్రవాదుల కాల్చివేత

ఈజిప్టు రాజధాని కైరోలో ఏడుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. నగరంలోని అమిరియా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగిఉన్నారన్న సమాచారంతో సోదాలు చేపట్టడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మూడు గంటలపాటుసాగిన కాల్పుల్లో ఏడుగరు ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఈజిప్టు అంతర్గత వ్యవహారాలశాఖ ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు అధికారి కూడా చనిపోయారని వెల్లడించింది. ఈస్టర్‌ సందర్భంగా క్రైస్తవులు భారీ ఎత్తున ప్రార్థనలు చేపట్టనున్న నేపథ్యంలో వారిపై దాడులకు తెగబడేందుకు ఈ ఉగ్రవాదులు సిద్ధమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 


logo